BIKKI NEWS (MAY 29) : Telangana pre primary govt schools 2026. 2026 విద్యా సంవత్సరానికి గాను 2769 పూర్వ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Telangana pre primary govt schools 2026
ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్.కే.జీ, యూ.కే.జీ. తరగతులను బోధిస్తారు.
ఈ సంవత్సరం 2769 పాఠశాలల ప్రారంభంతో రాష్ట్రంలో మొత్తం 4131 పూర్వ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ పాఠశాలల ప్రారంభంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 2769 ఇన్‌స్ట్రక్టర్, 2769 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 8 వేలు, ఆయా పోస్టుకు 6 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం లభిస్తుంది.
