BIKKI NEWS (APRIL 20) : RYTHU BHAROSA 2nd PHASE AMOUNT CREDIT TODAY. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులు ఈ రోజు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు .
RYTHU BHAROSA 2nd PHASE AMOUNT CREDIT TODAY
ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో నిధులు విడుదల చేయనున్నారు.
1 నుండి 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నేడు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
మొత్తం 45,11,947 మంది రైతులకు 2206.06 కోట్ల నిధులను ఈరోజు విడుదల చేయనున్నారు. నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఇప్పటికే మొదటి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

