BIKKI NEWS : Top standard GK bits part 146 for compititive exams in Telugu. ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.
Top standard GK bits part 146
1) థియోసోఫికల్ సొసైటీని ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1875
2) సాధారణంగా ఎన్ని రకాల (యాంటీ బాడీస్) ప్రతిదేహాలు ఉంటాయి.?
జ : ఐదు
3) టైఫాయిడ్ నుండి రక్షణ కోసం ఏ టీకా ను వేస్తారు.?
జ : టి ఏ బి
4) అందరికీ ఉపాధి కల్పన అనేది రాజ్యాంగంలోని దేని కిందకు వస్తుంది.?
జ : ఆదేశిక సూత్రాలు
5) మంత్రిమండలి పరిమాణంపై చేసిన రాజ్యాంగ సవరణ ఏది.?
జ : 91వ రాజ్యాంగ సవరణ (2004)
6) భారతదేశంలో మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు.?
జ : జాకీర్ హుస్సేన్
7) అతి తక్కువ కాలం పని చేసిన లోక్ సభ ఏది.?
జ : తొమ్మిదవ
8) నూతన ఆల్ ఇండియా సర్వీసులు ప్రారంభించేందుకు మొదటగా ఎవరి అనుమతి తీసుకోవాలి.?
జ : రాజ్యసభ
9) భారత దేశ వైశాల్యంలో ఎంత శాతం భూమి భూకంపాలకు గురవుతోంది.?
జ : 56%
10) భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది.?
జ : మిథైల్ ఐసో సైనేట్
11) కాగితపు కరెన్సీని మొదటగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు.?
జ : చైనా
12) మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరు వ్యవహరించారు.?
జ : కేసి నియోగి
13) భారతదేశం విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి స్థాపించిన బ్యాంకు ఏది.?
జ : ఎగ్జిమ్ బ్యాంక్
14) శని గ్రహ అధ్యయనం కోసం ప్రయోగించి వ్యోమోనౌక ఏది.?
జ : కాసిని
15) హరిత విప్లవం ప్రభావంతో అత్యధిక దిగుబడిని సాధించిన పంట ఏది?
జ : గోధుమ
16) 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా పని భాగస్వామ్యపు రేటు ఉన్న రాష్ట్రం.?
జ : హిమాచల్ ప్రదేశ్
17) సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభించారు.?
జ : జనవరి 22 – 2015
18) పట్టణీకరణకు స్వర్ణ యుగంగా పేరొందిన కాలం.?
జ : మొగల్ యుగం
19) ఆంగ్లేయుల ఆర్థిక విధానం గంగా ఒడ్డున ఉన్న సంపదనంతా పీల్చేసి థేమ్స్ ఒడ్డున కక్కే స్పాంజీ లాంటిది అని వ్యాఖ్యానించినది ఎవరు?
జ : సుమలీ వాన్
20) అక్బర్ సిస్తు విధించడానికి అనుసరించిన పద్ధతి.?
జ : దస్ సాలి
21) మధ్యయుగ ఆర్థిక వ్యవస్థను భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న తొలి భారతదేశ చారిత్రకారుడు ఎవరు.?
జ : ఆర్ఎస్ శర్మ
22) ఏ కేసులో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
23) భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావన అనేది.?
జ : పరోక్షంగా ప్రస్తావించారు – వివరించారు
24) ప్రాథమిక విధుల అమలు ఉల్లంఘనకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది.?
జ : జస్టిస్ జెఎస్ వర్మ కమిటీ
25) రాజ్యాంగం లోని ఏ ప్రకరణ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ఒక ప్రత్యేక పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుపుతోంది.?
జ : ప్రకరణ 244
26) గణతంత్ర రాజ్యం అనే భావనను భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఫ్రెంచ్
27) ప్రాథమిక హక్కుల భాగాన్ని భారత రాజ్యాంగం అంతరాత్మ లేదా వివేకం అని వర్ణించినది ఎవరు?
జ : జవహర్ లాల్ నెహ్రూ
28) భారతదేశ విదేశీ విషయాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఏ శక్తికి లొంగదు అనే అంశాన్ని తెలిపే రాజ్యంగలోని పదం?
జ : సర్వసత్తాక
29) భారత రాజ్యాంగంలోని 112 వ అధికరణ దేని గురించి తెలుపుతుంది.?
జ : వార్షిక ఆర్థిక నివేదికను తయారు చేయడం
30) 86వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది.?
జ : 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించిన ప్రకరణ 21(A) చేర్చడం

