Today top news in telugu march 12th 2026 by bikki news

Today top news in Telugu March 12th 2026 – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS (MAR. 12) : Today top news in Telugu March 12th 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu March 12th 2026

Today Telangana News

హైదరాబాద్ హాస్టల్స్‌లో మెనూ మార్పు: గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్‌లోని పలు హాస్టళ్లు, పీజీల్లో మార్చి 10 నుంచి టిఫిన్లు (దోశ, పూరీ, ఇడ్లీ) నిలిపివేస్తూ నోటిఫికేషన్లు జారీ చేశారు. కేవలం రెండు పూటల భోజనం మాత్రమే అందించాలని నిర్ణయించారు.

కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ (Third Discom): తెలంగాణలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మూడవ డిస్కామ్ “తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL)” ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖీని నియమించింది.

జిల్లా కేంద్రాల్లో రింగ్ రోడ్లు: రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రింగ్ రోడ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచించారు.

వార్షిక బడ్జెట్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు

ఎలక్ట్రిక్ వాహనాలు : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖలు ఎలక్ట్రిక్ వానాలనే ఇక నుండి కొనాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రబీ పంటల కొనుగోలు: తెలంగాణలోని రబీ 2026 సీజన్ కోసం 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర (MSP) వద్ద కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీని విలువ సుమారు ₹894 కోట్లు. ఇందులో శనగలు, మినుములు, వేరుశనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాలు ఉన్నాయి.

ఫిరాయింపుల తీర్పుపై ఆగ్రహం: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడాన్ని BRS తీవ్రంగా ఖండించింది.

Today Andhra Pradesh news

హోటల్స్ మూసివేత: కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యామ్నాయం లేకపోతే ప్రతి సోమవారం రెస్టారెంట్లు మూసివేయాలని, స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు నిలిపివేయాలని భావిస్తున్నారు.

బడ్జెట్ విమర్శలు: ఏపీ బడ్జెట్ అబద్ధాల పుట్ట అని, అప్పుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని జగన్ విమర్శించారు. కేవలం రెండేళ్లలో బాబు ప్రభుత్వం రూ. 3.20 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు.

గంజాయి ముఠా అరెస్ట్: గుంటూరులో 7.6 కిలోల గంజాయి, డ్రగ్స్ క్యాప్సూల్స్‌తో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హెలిపోర్టుల ఏర్పాటు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో హెలిపోర్టులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని అభివృద్ధి చేసి కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించారు.

భూముల కేటాయింపుపై హైకోర్టు తీర్పు: గూగుల్ మరియు ఇతర ఐటీ సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

లోక్ అదాలత్: మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి ఇది మంచి అవకాశం.

Today National News

గ్యాస్ సంక్షోభం – కొత్త నిబంధన: చమురు, గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.

కారుణ్య మరణానికి అనుమతి: 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా అనే వ్యక్తికి సుప్రీంకోర్టు దేశంలోనే తొలిసారిగా కారుణ్య మరణానికి (Passive Euthanasia) అనుమతినిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

PM KISAN : మార్చి 13 నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు జమ కానున్నట్లు కేంద్రం ప్రకటించింది.

స్పీకర్ తొలగింపు తీర్మానం: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష గొంతు నొక్కేలా స్పీకర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది

LPG కొరతపై స్పష్టత: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఉందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని హోం శాఖ మరియు పెట్రోలియం శాఖ అధికారులు భరోసా ఇచ్చారు. నకిలీ వార్తలను నమ్మవద్దని, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆధార్ సెక్యూరిటీ: ఆధార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు UIDAI మొదటిసారిగా ‘బగ్ బౌంటీ’ (Bug Bounty) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. వ్యవస్థలో లోపాలను గుర్తించిన వారికి బహుమతులు అందించనున్నారు.

8వ వేతన సంఘం (8th Pay Commission): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు నేడు (మార్చి 12) ఉన్నతాధికారులతో భేటీ కానున్నాయి. ప్రధానంగా CGHS సౌకర్యాల విస్తరణ, సెలవుల పెంపు మరియు పర్సనల్ కేర్ లీవ్ వంటి అంశాలపై డిమాండ్లను చర్చించనున్నారు.

రక్షణ రంగం: భారత మరియు ఫ్రెంచ్ సైన్యాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు మరియు ‘ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్’ వాడకంపై రెండు దేశాల నిపుణులు చర్చలు జరిపారు

మారిషస్ జాతీయ దినోత్సవం: మారిషస్ 58వ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక INS త్రిఖండ్ ఆ దేశానికి చేరుకుంది

Today International News

ఇరాన్ హెచ్చరిక: గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా ఆఫీసులే తమ తదుపరి లక్ష్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.

థాయ్ నౌకపై దాడి: భారత్ (గుజరాత్)కు వస్తున్న థాయ్‌లాండ్ కార్గో నౌకను హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పేల్చేసింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH): ఇంధనం ఆదా చేసేందుకు వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు ఐటీ ఉద్యోగులకు తిరిగి WFH ప్రకటించాయి. భారత ఐటీ కారిడార్లలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

UNSC తీర్మానం: గల్ఫ్ దేశాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) బుధవారం రాత్రి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ తన దాడులను ఆపాలని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఈ తీర్మానం స్పష్టం చేసింది.

చమురు నిల్వల విడుదల: పెరుగుతున్న గ్యాసోలిన్ ధరలను తగ్గించేందుకు అమెరికా తన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల (Strategic Petroleum Reserve) నుండి చమురును విడుదల చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

బ్రిటన్ కరెన్సీ మార్పు: ఇంగ్లీష్ బ్యాంక్ నోట్లపై విన్స్టన్ చర్చిల్ ఫోటో స్థానంలో వైల్డ్ లైఫ్ (వన్యప్రాణుల) చిత్రాలను ముద్రించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.

Today Business News

స్టాక్ మార్కెట్ పతనం: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మార్కెట్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు సుమారు రూ. 8 లక్షల కోట్లు నష్టపోయారు.

ముద్రా లోన్ (PMAY-U 2.0) వడ్డీ రాయితీ: పీఎం ఆవాస్ యోజన – అర్బన్ 2.0 కింద ఇళ్లు నిర్మించుకునే వారికి ముద్రా లోన్లపై 4% వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు రుణ భారం తగ్గనుంది.

Gold rate – స్వల్పంగా పెరిగిన బంగారం ధర. డాలర్ తో రూపాయి మారకం విలువ పెరుగుతూనే ఉంది.

డిజిటల్ పేమెంట్స్ రికార్డ్: ఫిబ్రవరి 2026 నెలలో యూపీఐ (UPI) లావాదేవీల విలువ మొదటిసారిగా ₹25 లక్షల కోట్లు దాటినట్లు ఎన్‌పిసిఐ (NPCI) ప్రకటించింది

Today Sports News

IPL 2026 షెడ్యూల్: ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28న బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB vs SRH తలపడనున్నాయి.

వేల్స్‌పై విక్టరీ: బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో వేల్స్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. నవనీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో 2026 మహిళా హాకీ వరల్డ్ కప్‌లో భారత్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

Today Education and Job Updates

INTER EXAMS – నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

NEET UG 2026 CORRECT WINDOW నేటి నుండి 14 వరకు అందుబాటులో ఉంటుంది.

COE admissions 2026 – తెలంగాణ గురుకుల సీవోఈ లలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు.

AP RTE ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్లు: ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం (RTE) కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

KGBV అడ్మిషన్లు (AP): రాష్ట్రంలోని 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు నేటి (మార్చి 12) నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అనాథలు, బడి బయట పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల బాలికలు apkgbv.apcfss.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ గ్రూప్-4 బ్యాక్‌లాగ్: 5వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేని బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జిల్లా స్థాయిలో కొనసాగుతోంది.

ఏపీ శిశు సంక్షేమ శాఖ: 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →