BIKKI NEWS (OCT. 26) : Without aadhar seeding no salaries for employees. ఆధార్ సంఖ్యను అందించని ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
Without aadhar seeding no salaries for employees
రాష్ట్రంలో పని చేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ల వివరాలు అక్టోబర్ 25వ తేదీకల్లా ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (IFMIS)లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థికశాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్ అధికారులదేనని హెచ్చరించింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత కేటగిరీలో 5.21 లక్షల మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు.
ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారని, మరికొందరు అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా జీతాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలామంది వివరాలివ్వడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
