BIKKI NEWS (DEC. 04) : West Bengal Teachers Case closed. పశ్చిమ బెంగాల్ లో 32 వేల మంది ఉపాధ్యాయ నియామకం కేసులో నియామకాలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. సింగిల్ బెంచ్ రద్దు చేసిన.. ఆ 32వేలమంది ప్రైమరీ టీచర్ల నియామకాలు చెల్లుతాయని పేర్కొంది.
West Bengal Teachers Case closed.
తొమ్మిదేళ్లుగా సర్వీసులో ఉన్న వారిని ఇప్పుడు తొలగిస్తే.. వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కేసు ఏంటంటే.?
2014 ఉపాధ్యాయ అర్హత పరీక్ష తర్వాత నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ 2023లో 32వేల మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేసింది. ఆ స్థానాలకు మూడు నెలల్లోపు కొత్త నియామక ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అనంతరం కేసును విచారించిన జస్టిస్ సుబ్రతా, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వుపై స్టే విధించింది. కొత్త నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి రాష్ట్రానికి ఆరు నెలల అనుమతి ఇచ్చింది.
ఈ స్టేకు వ్యతిరేకంగా రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు తుది విచారణ కోసం హైకోర్టుకు తిరిగి పంపింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ టీచర్ల నియామకాలు చెల్లుతాయని తీర్పునిచ్చింది.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

