Today top news in telugu march 26th 2026 - నేటి ప్రధాన వార్తలు - bikki news

Today top news in Telugu march 26th 2026 – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS : Today top news in Telugu march 26th 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu march 26th 2026

Today Telangana News

పెట్రోల్, గ్యాస్ కొరతపై అత్యవసర భేటీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. యూరియా నిల్వలపై కూడా చర్చించారు.

సమృద్ధిగా ఇంధనం : రాష్ట్రంలో సమృద్ధిగా గ్యాస్ ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ఉన్నాయని ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ప్రభుత్వం ప్రకటించింది.

నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం ఆందోళన: లోక్‌సభ స్థానాల పెంపు (Delimitation) జరిగితే ఉత్తరాదికి ప్రాధాన్యత పెరిగి దక్షిణాది రాష్ట్రాలు జాతీయ రాజకీయాల్లో అప్రస్తుతంగా మారతాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

తెలంగాణ జీఎస్‌టీ సవరణ బిల్లు: అసెంబ్లీలో తెలంగాణ జీఎస్‌టీ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రవేశపెట్టారు.

వైద్య విధాన పరిషత్ రద్దు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు.

భద్రాచలం అభివృద్ధి : 586 కోట్లతో భద్రాచలంను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.

పార్టీ ఫిరాయింపు : అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

హరీష్ రావు : బీసీ ఎస్సీ ఎస్టీలకు రెండు శాతం నిధులు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని అసెంబ్లీలో హరీష్ రావు తెలిపారు.

Andhra Pradesh News

హర్ ఘర్ జల్ 2028: జల జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి ఏపీలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

టూరిజం రోడ్‌మ్యాప్: రాష్ట్రంలో 50,000 హోటల్ గదులు, 10,000 హోమ్‌స్టేలను 2029 నాటికి సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీ ప్లేన్, హెలి-టూరిజంను ప్రోత్సహించనున్నారు

పవన్ కల్యాణ్‌కు ఊరట: సినిమాల్లో నటిస్తూ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదని దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

విద్యుత్ కొనుగోలు లక్ష్యం: విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు ₹4కు పరిమితం చేయాలని సీఎం చంద్రబాబు ఇంధన శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

Today National News

కేబినేట్ సమావేశం : కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పశ్చిమాసియా సంక్షోభంపై అఖిలపక్ష భేటీ: గల్ఫ్ యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్రం నేడు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది

ఉడాన్ (UDAN) పథకం విస్తరణ: ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకం ‘ఉడాన్’ను ₹28,840 కోట్ల వ్యయంతో పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది

ట్రాన్స్‌జెండర్ బిల్లు ఆమోదం: ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

క్లైమేట్ యాక్షన్ (NDC 2031-35): ఐక్యరాజ్యసమితికి సమర్పించాల్సిన 2031-35 మధ్యకాలపు వాతావరణ లక్ష్యాలకు (NDC) ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది

విదేశీయుల ట్రాకింగ్ (IVFRT): విదేశీయుల రిజిస్ట్రేషన్ మరియు ట్రాకింగ్ పథకాన్ని 2031 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

International News

యుద్ధ విరమణ చర్చలు: ఇరాన్-అమెరికా మధ్య షరతులతో కూడిన యుద్ధ విరమణ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్‌కు అమెరికా 15 షరతులు విధించినట్లు తెలుస్తోంది.

ముడిచమురు ధరలు: సరఫరా ఆటంకాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $100 వద్దే కొనసాగుతోంది, ఇది దిగుమతి చేసుకునే దేశాలపై భారం చూపుతోంది.

యూఎన్ హెచ్చరిక: పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పిలుపునిచ్చారు.

గ్లోబల్ వాటర్ క్రైసిస్: ప్రపంచవ్యాప్తంగా నీటి అభద్రత అసమానతలకు దారితీస్తోందని తాజా డబ్ల్యూఎంఓ (WMO) నివేదిక వెల్లడించింది

Today Sports News

ఆర్‌సీబీ (RCB) విక్రయం: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం $1.78 బిలియన్లకు (సుమారు ₹16,706 కోట్లు) కొనుగోలు చేసింది

ఆసియా లాక్రోస్ గేమ్స్: రియాద్‌లో జరిగిన ఆసియా లాక్రోస్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా సత్కరించారు.

ఐపీఎల్‌కు ఆకాశ్ దీప్ దూరం: గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పేసర్ ఆకాశ్ దీప్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్: చత్తీస్‌గఢ్‌లో మొదటిసారిగా ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ నేటి నుండి ప్రారంభమయ్యాయి

లేబ్రాన్ జేమ్స్ రికార్డు: ఎన్బీఏ (NBA) చరిత్రలో అత్యధిక రెగ్యులర్ సీజన్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా లేబ్రాన్ జేమ్స్ రికార్డు సృష్టించారు

Today Business News

Stock Market – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.

Gold rate – బుధవారం భారీగా పెరిగిన బంగారం, వెండి, ప్లాటినం ధరలు.

రిలయన్స్-డిస్నీ విలీనం: వినోద రంగంలో పెనుమార్పులు తెచ్చే రిలయన్స్-డిస్నీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

జీడీపీ : 2026-27 లో భారత్ 7.1% వృద్ధి సాదిస్తుందని ఎస్ & నీ సంస్థ అంచనా వేసింది

Today Education & Job Updates

TGPSC OTR తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓటీఆర్ ఎడిట్ చేసుకోవడానికి ఏప్రిల్ 10 వరకు గడువు పొడిగించింది

ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2026: 25,000 జీడీఎస్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ లిస్ట్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది.

AP INTER ADMISSIONS – ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి

QS WORLD RANKINGS – క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో భారత్ నుండి ఐఐటి ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్ 50 లో 27 భారత విద్యాసంస్థలు చోటు సంపాదించుకున్నాయి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →