Today top news in telugu march 10th 2026 by bikki news

Today Top News In Telugu March 10th 2026 – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS (MAR. 10) : Today Top News In Telugu March 10th 2026 – నేటి ప్రధాన వార్తలు. తెలంగాణ, ఏపీ, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, బిజినెస్, విద్యా, ఉద్యోగ వార్తల సమాహారం.

Today Top News In Telugu March 10th 2026

తెలంగాణ వార్తలు (Today Telangana News)

నల్లచెరువు ప్రారంభం: కూకట్‌పల్లిలో పునరుద్ధరించిన నల్లచెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

వేసవి హెచ్చరిక: ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

స్కూళ్లలో స్టీమ్ రైస్: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఇకపై ముద్ద అన్నం కాకుండా ‘స్టీమ్ రైస్’ వడ్డించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

TG YISU – ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు లక్ష్యంగా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Police Retreat – రాబోయే 25 సంవత్సరాలలో ఏర్పడే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Evening BTech – ఈవినింగ్ బీటెక్ కోర్సులకు అనుమతి ఎత్తు విద్యాశాఖ జీవో నెంబర్ 30ని విడుదల చేసింది

రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ వార్తలు (Today A.P. News)

గ్రేట్ గ్రీన్ వాల్: తీర ప్రాంత కోతను అరికట్టడానికి ఏపీ తీరం వెంబడి 1053 కి.మీ మేర ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

యుద్ధం ఎఫెక్ట్: ఇరాన్ యుద్ధం కారణంగా ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీనితో స్థానికంగా గుడ్లు (రూ. 3), అరటి ధరలు భారీగా పడిపోయాయి.

లక్షమంది మహిళా పారిశ్రామిక విత్తనం తయారు చేయడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

నంద్యాలలో పట్టాదారు పాస్‌బుక్‌లు: ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో ఏఐ (AI) టెక్నాలజీ: రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

జాతీయం (National News)

గ్యాస్ రీఫిల్ నిబంధనల్లో మార్పు: డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోర్డింగ్‌ను అరికట్టి, గ్యాస్‌ను అందరికీ సమానంగా పంపిణీ చేయడమే దీని లక్ష్యం.

Delhi Liquor Scam – ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా ఊరట లభించిన కేజ్రీవాల్ , సిసోరియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ. చేసింది ఈనెల 16 కు వాయిదా .

CAA అప్‌డేట్: పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద అస్సాంలో మొదటి పౌరసత్వ ధృవీకరణ పత్రం జారీ అయ్యింది.

పార్లమెంట్ వాయిదా: విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.

ప్రధానమంత్రి ఆరోగ్య మంత్రం: నివారణ ఆరోగ్య సంరక్షణ (Preventive Healthcare)పై జరిగిన వెబ్‌నార్‌లో పీఎం మోదీ ప్రసంగించారు. టెలిమెడిసిన్, ఆయుష్మాన్ భారత్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయని, కేర్ గివర్ల (Caregivers) శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ఆయిల్ & గ్యాస్ నిల్వలు: భారత్ వద్ద సుమారు 423.1 MMT క్రూడాయిల్ మరియు 595.4 BCM సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో వెల్లడించారు. భవిష్యత్తులో సరఫరా ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

అంతర్జాతీయం (International News)

పశ్చిమాసియాలో అగ్నిగుండం: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసింది. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది.

ఇరాన్ కొత్త నేత: అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు.

Business News

స్టాక్ మార్కెట్ పతనం : యుద్ధభయాలు, చమురు ధరల భయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి అయింది. నేటి స్టాక్ మార్కెట్ వ్యూహం కోసం క్లిక్ చేయండి.

గోల్డ్ రేట్: పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధర తులంపై సుమారు రూ. 1960 వరకు తగ్గింది. (నేటి బంగారం ధరలు కోసం క్లిక్ చేయండి.)

టెక్ మహీంద్రా క్లారిటీ: ఏఐ (AI) కారణంగా భారీగా ఉద్యోగుల తొలగింపు జరుగుతుందన్న వార్తలను టెక్ మహీంద్రా యాజమాన్యం ఖండించింది.

Sports News

ICC T20 WORLD CUP 2026 RECORDS and STATS

భారత్ vs స్కాట్లాండ్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ (FIH) మహిళా హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో భారత్, స్కాట్లాండ్ జట్ల మధ్య పోరు 2-2తో డ్రాగా ముగిసింది. అంతకుముందు ఉరుగ్వేపై భారత్ 4-0తో విజయం సాధించింది.

శ్రీలంక – ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ రద్దు: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా యూఏఈ (UAE) వేదికగా జరగాల్సిన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

స్మృతి మంధాన రికార్డు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత క్రికెటర్ స్మృతి మంధాన గౌరవార్థం ఆమె రూపంలో ఉన్న ‘బార్బీ డాల్’ను విడుదల చేశారు. ఈ గౌరవం దక్కిన తొలి క్రికెటర్ ఆమె కావడం విశేషం.

ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్: మొదటిసారిగా ఛత్తీస్‌గఢ్‌లో మార్చి 25 నుండి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.

విద్య & ఉద్యోగ అవకాశాలు (Education & Jobs)

Inter Exams : నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరగనున్నాయి

సైనిక్ స్కూల్ రిక్రూట్‌మెంట్: సైనిక్ స్కూల్స్ సొసైటీలో వివిధ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.

NIT రిక్రూట్‌మెంట్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో 250+ టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.

SBI యూత్ ఫర్ ఇండియా: ఈ ఫెలోషిప్‌కు ఎంపికైతే నెలకు రూ. 19,000 స్టైపెండ్ లభిస్తుంది.

అగ్నివీర్ వాయు: ఏపీలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర అన్ని ప్రభుత్వ ప్రవేశ పరీక్షల 2026 నోటిఫికేషన్ లు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →