హైదరాబాద్ (ఏప్రిల్ 09) : Today top news in Telugu April 9th 2026
Today top news in Telugu April 9th 2026
Today Telangana News
విద్యాభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారు
రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మించడానికి కేంద్రం అంగీకారం తెలిపింది
ఆర్టీసీ ఉద్యోగుల సహస్ర మరణానికి 10 లక్షల రూపాయల జీవిత భీమాను సంస్థ కల్పించింది.
జస్టిస్ ఘోష్ నివేదికపై తీర్పును ఏప్రిల్ 20 కి వాయిదా వేసిన హైకోర్టు
సాదాబైనామా సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదల చేసిన భూ పరిపాలన శాఖ.
వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాల , ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Today AP News
2016కు ముందు ప్రభుత్వం నుండి పట్టా పొందిన లబ్ధిదారులు ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చని చంద్రబాబు తెలిపారు.
త్వరలోనే ఐదు కిలోల సిలిండర్లు మరియు కిరోసిన్ పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు
పాదయాత్ర ప్రారంభమయ్యాక చంద్రబాబుకు నిజమైన సినిమా చూపిస్తానని ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. మావిగన్ అద్భుతమైన ప్లాన్ అని మరోసారి స్పష్టం చేశారు.
లులూ మాల్ కు విజయవాడలో ఆర్టీసీ స్థలం ఇవ్వట్లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
వచ్చే మార్చినాటికి 1.12 కోట్ల పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని సీఎం తెలిపారు.
Today National News
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ ఆమోదం తెలపాలని ప్రత్యేక వ్యాసం రాసిన నరేంద్ర మోడీ.
కేరళ ,అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.
శబరిమల లో మహిళలకు ప్రవేశాల అంశంపై ఏవి మూఢ నమ్మకాలో నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి చర్చలు కొనసాగుతున్నాయి
ముద్ర యోజనతో వ్యాపార సంబంధాలు బలోపేతం అవుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.
Today International News
ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్ మీద ఇజ్రాయిల్ దాడులు చేయడంతో 112 మంది మృతి చెందారు
దీంతో ఇరాన్ హర్మోజ్ జల సంధిని మరోసారి మూసివేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి మొదటికి వచ్చాయి.
ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్ లను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
Today Business News
Stock market – బుధవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. యుద్ధ భయాలు తొలగిన నేపథ్యంలో 23,977 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.
Gold Rate – బంగారం, వెండి ధరలు కూడా బుధవారం భారీగా పెరిగాయి . బంగారం 4000 వరకు పెరిగింది.
RBI MPC – రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో వడ్డీరేట్లను యధాతధంగా ఉంచింది.
ఆదాని వినతి పై విచారణ చేయడానికి అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆదానికి ఊరట లభించినట్లయింది.
Today Sports News
GT VS DC : ఉత్కంఠ భరితంగా జరిగిన ఢిల్లీ గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.
IPL 2026 – ఐపీఎల్ లో నేడు కోల్ కతా – లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజి వన్ ఫైనల్ కు వెళ్లిన సురేఖ బృందం
హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు అర్జెంటీనా బయలుదేరిన భారత బృందం
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వైశాలి
Today Education and Job Updates
ముగిసిన జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 20న ఫలితాలు విడుదలయ్యే అవకాశం.
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
NTET EDIT : దరఖాస్తు ఎడిట్ చేసుకోవడానికి నేటి వరకు అవకాశం కలదు.
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం దోస్తు ద్వారానే ప్రవేశాలు కల్పించనున్నారు.
తెలంగాణ యంగ్ ఇండియా యూనివర్సిటీలో రెండు నూతన కోర్సులను ప్రవేశపెట్టారు.

