హైదరాబాద్ : Today top news in Telugu April 6th 2026 – నేటి ప్రధాన వార్తలు
Today top news in Telugu April 6th 2026
Today Telangana News
UKG – వచ్చే విద్యా సంవత్సరం నుండి 3 వేల ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు
యువత క్రీడా మైదానాలను వదిలేసిందని, వారిని క్రీడామైదానాలకు తేవడం ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా యువతను తయారు చేసుకోవాలని కొలంబియా బిజినెస్ స్కూల్లో కేటీఆర్ ప్రసంగించారు
ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభ: అడవి బిడ్డల సమస్యల పరిష్కారం మరియు ‘ప్రజా పాలన’ వేడుకల్లో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో భారీ బహిరంగ సభ.
హామీల అమలు పత్రాల పంపిణీ: భట్టి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన పత్రాలను నేడు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
నీటి ప్రాజెక్టులపై సమీక్ష: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులు: రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం: కొత్తగా ఆమోదించిన ‘పేరెంట్స్ సపోర్ట్ బిల్లు’ అమలు విధివిధానాలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమావేశం కానున్నారు.
Today Andhra Pradesh News
100 రోజుల నీటి సంరక్షణ ప్రణాళిక: నేటి నుండి (ఏప్రిల్ 6) ఆంధ్రప్రదేశ్‌లో ‘100 రోజుల నీటి సంరక్షణ ప్రణాళిక’ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యం.
తాడీపత్రి నుండి ప్రారంభం: అనంతపురం జిల్లా తాడుపత్రి నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమాన్ని సీఎం అధికారికంగా లాంఛ్ చేశారు. భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు చెక్ డ్యామ్‌ల మరమ్మత్తులు చేపట్టనున్నారు.
ప్రతిపక్షం (YSRCP): అమరావతి రాజధాని విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని, వైసీపీ హయాంలో చేసిన పనులనే చూపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు.
ఆగస్టు లోపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది
ఏపీలో ఒకవైపు ఎండలు మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితిలు నెలకొన్నాయి
Today National News
దేశంలో అత్యంత అవినీతి సీఎం హేమంత ను జైలుకు పంపిస్తామని రాహుల్ వ్యాఖ్యానించారు.
పోటీ చేసే వ్యక్తుల చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మ కాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వివాదాస్పద నకిలీ బాబా అశోక్ కారత్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ కాల్స్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణ నుండి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ను తప్పించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు
నేషనల్ మేరిటైమ్ డే: జాతీయ సముద్రయాన దినోత్సవం సందర్భంగా భారత సముద్ర సంపద మరియు నౌకాదళం సాధించిన విజయాలను కొనియాడుతూ ప్రధాని సందేశం ఇచ్చారు.
జనగణన 2027 డిజిటల్ రిజిస్ట్రేషన్: జనాభా గణనలో ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని కేంద్ర హోం శాఖ నేడు సరికొత్త పోర్టల్‌ను ప్రజలకు పరిచయం చేసింది
హార్ముజ్ జలసంధి భద్రత: భారత ఎల్పీజీ నౌక ‘గ్రీన్ ఆశా’ నేడు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Today International News
ఇరాన్ ఉరిశిక్షలు: ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులకు ఇరాన్ నేడు ఉరిశిక్ష అమలు చేసినట్లు ఆ దేశ న్యాయ శాఖ ధ్రువీకరించింది.
ట్రంప్ హెచ్చరిక – ఇరాన్ స్పందన: ట్రంప్ ఇచ్చిన ’48 గంటల’ అల్టిమేటం కేవలం భయంతో ఇచ్చినదని, తమపై ఎటువంటి ఒత్తిడి లేదని ఇరాన్ మిలిటరీ కమాండ్ తిరస్కరించింది.
లెబనాన్ దాడులు: బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. కీలకమైన వంతెనలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
నాసా ఆర్టెమిస్-2: చంద్రుడి దిశగా సాగుతున్న వ్యోమగాముల మిషన్‌లో నేడు ఒక కీలకమైన కమ్యూనికేషన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా వెల్లడించింది.
బహ్రెయిన్ నిరసనలు: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్‌లో అంతర్గత అశాంతి పెరగడంతో అక్కడ కఠిన ఆంక్షలు విధించారు
యూఎస్ వీసాల రద్దు: ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న పలువురు ఇరాన్ పౌరుల గ్రీన్ కార్డులు మరియు వీసాలను అమెరికా రద్దు చేసింది
Today Business News
నిఫ్టీ బుల్లిష్ ట్రెండ్: నేటి నుండి (ఏప్రిల్ 6-10) ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ 23,100 పైన స్థిరంగా ఉంటే స్టాక్ మార్కెట్ బుల్లిష్ ట్రెండ్‌లో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బంగారం ధర: అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల బంగారం ధర తులం (24K) సుమారు ₹1,50,000 మార్కు వద్దే కొనసాగుతోంది.
ఐటీ రంగం అప్‌డేట్: గ్లోబల్ డిమాండ్ పెరగడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు కొత్త ప్రాజెక్టులను దక్కించుకున్నట్లు సమాచారం.
చమురు ధరల ఒత్తిడి: గల్ఫ్ సంక్షోభం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $110 మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
మారుతి సుజుకి: ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది.
Today Sports News
ఆర్‌సీబీ ఘన విజయం: నిన్న బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
SRH VS LSG : ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో విజయం సాధించింది.
నేటి ఐపీఎల్ మ్యాచ్: నేడు KKR VS PBKS ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది.
నేటి నుండి ఇండియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది
Education and Job Updates
జేఈఈ మెయిన్ సెషన్-2: నేడు (ఏప్రిల్ 6) పరీక్ష రాస్తున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటో వెంట ఉంచుకోవాలి. పరీక్షలు ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి.
RBI అసిస్టెంట్ ప్రిలిమ్స్: ఏప్రిల్ 11న జరగనున్న ఆర్బీఐ అసిస్టెంట్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్లు వెలువడ్డాయి.
IDBI జూనియర్ మేనేజర్: ఏప్రిల్ 12న ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు
సీబీఎస్ఈ 10 & 12 ఫలితాలు: ఏప్రిల్ 9 నాటికి మూల్యాంకన ప్రక్రియ ముగియనుందని, మే మొదటి వారంలో ఫలితాలు వెలువడతాయని సమాచారం
UGC NET 2025 సవరించిన ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది.
ఏపీ టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు 6 మార్కులు కలుపుతామని విద్యాశాఖ ప్రకటించింది.

