హైదరాబాద్ (ఏప్రిల్ 01) : Today in history April 1st – చరిత్రలో ఈరోజు
Today in history April 1st
దినోత్సవం
- ఎప్రిల్ ఫూల్స్ డే
- ఒడిషా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
సంఘటనలు
1914: ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
1935: భారతీయ రిజర్వు బ్యాంకు స్థాపించబడింది.
1936: కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది.
1957: డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న ‘డబ్బు’, ‘రూపాయి’ లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబరు 1958 న ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి కొలమానం (యూనిట్) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.[1]
1960: TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
1973: పులుల సంరక్షన పథకం – కోర్బెట్ట్ నేషనల్ పార్కులో పులుల సంరక్షణా పథకాన్ని ప్రారంబించారు.
2001: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.
2010 : RTE- విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం.. edit by. మాధవ చారి.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
జననాలు
1578: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657)
1856: అకాసియో గాఅబ్రియెల్ వేగాస్, భారత దేశ ప్రముఖవైద్యుడు. (మ.1933)
1889: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (మ.1940)
1911: ఫాజా సింగ్, భారత అథ్లెట్.
1911: ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (మ.1949)
1936: తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి.
1938: ఆనంద కృష్ణన్, మలేషియా వ్యాపారవేత్త (మ.2024)
1941: అజిత్ వాడేకర్, భారత క్రికెటర్.
1945: సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1947: అజిత్ పాల్ సింగ్, భారత హాకీజట్టు మాజీ నాయకుడు, అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత.
1958: విక్కీ హామిల్టన్, అమెరికన్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్
1963: వినోద్ కుమార్, ప్రముఖ సినీ నటుడు.
1972: వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.
1988: లహరి గుడివాడ, రంగస్థల నటి.
1993: శ్రీదివ్య, బాల నటి గా ప్రవేశించి తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
మరణాలు
1922: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్‌కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884)
1943: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911)
1999: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930)
2012: ఎన్.కె.పి.సాల్వే, భారత రాజకీయవేత్త. (జ. 1921)
2018: రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956)
2022: శరత్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు.

