Good news for employees - ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేబినెట్ - bikki news

Good news For Employees – ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేబినెట్

BIKKI NEWS (APRIL 23) : TG CABINET SAID GOOD NEWS FOR EMPLOYEES. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఉద్యోగులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడానికి మార్గాలను అన్వేషించాలని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

TG CABINET SAID GOOD NEWS FOR EMPLOYEES

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ అందించే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు.

అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →