Special tet 2026 - ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ - bikki news

Special TET 2026 – ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్

BIKKI NEWS (APRIL 24) : special TET 2026 for in service teachers in off line mode. తెలంగాణ రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ 2026 పరీక్ష ను ఆఫ్ లైన్ పద్ధతిలో నిర్వహించే సాధ్యసాధ్యాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీ యోగిగా రాణా పాఠశాల విద్యాశాఖ కు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

special TET 2026 for in service teachers in off line mode.

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా టీచర్లు ఉత్తీర్ణత సాధించాగా, ప్రస్తుతం కొనసాగుతున్న టెట్ నోటిఫికేషన్ కూడా ఇన్ సర్వీస్ టీచర్లు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా పేపర్ పెన్ను పద్ధతిలో ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించే సాధ్యసాధ్యాలను, నిబంధనలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →