BIKKI NEWS (DEC. 17) : SONIA GANDHI ON ASHA and ANGANWADI WORKERS REMUNERATION. దేశంలో
మహిళా ఫ్రంట్ లైన్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు.
SONIA GANDHI ON ASHA and ANGANWADI WORKERS REMUNERATION.
ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సహాయకుల వేతనాలు రెట్టింపు చేయాలని ఈ సందర్భంగా సోనియాగాంధీ ప్రస్తావించారు.
సమీకృత బాలల అభి వృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) కార్యక్రమం లోని వివిధ స్థాయిల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పార్లమెంట్ జీరో అవర్ లో సోనియా ఈ సమస్యను లేవనెత్తారు.
అంగన్ వాడీలు, సహాయకులు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద పనిచేసే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ప్రజాసేవలో కీలకంగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు.
వీరు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే ఆశావర్కర్లకు నెలకు రూ.4,500, రూ.2500 చెల్లిస్తోందన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 లక్షల పోస్టులను భర్తీ చేసినా.. పెరుగుతున్న జనాభా అవసరాలకు అవి సరిపోవన్నారు. వారి జీతాలను రెట్టింపు చేయాలని కోరారు.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

