BIKKI NEWS (SEP. 01) : sbi po prelims result 2025. భారతీయ స్టేట్ బ్యాంక్ పీవో ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.
sbi po prelims result 2025
ఆగస్టు 4, 5 తేదీల్లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంచింది. మొత్తం 541 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఫలితాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు లింకు ని క్లిక్ చేసి “Recruitment Results” విభాగంలో CRPD/PO/2025-26/04 నోటిఫికేషన్ క్రింద లభ్యమయ్యే లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాన్ని చూడవచ్చు.
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇది సెప్టెంబర్ 2025లో నిర్వహించనున్నారు. మెయిన్స్ అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. మెయిన్స్ అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూలు కూడా జరుగనున్నాయి.
sbi po prelims result 2025 link

