Guest lecturers - జూనియర్ కళాశాలల్లో 566 మంది రెన్యువల్ - bikki news

GUEST LECTURERS – జూనియర్ కళాశాలల్లో 566 మంది రెన్యువల్

BIKKI NEWS (NOV. 09) : Renewal Guest faculty and out sourcing employees in GJCs 2025. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 566 మంది గెస్ట్ ఫ్యాకల్టీ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది రెన్యువల్ కు ఆర్థిక శాఖ అనుమతి తెలిపింది. వీరి సేవలను 2026 మార్చి 31 వరకు వినియోగించుకోనున్నారు.

Renewal Guest faculty and out sourcing employees in GJCs 2025.

2025 – 26 విద్యా సంవత్సరానికి గాను 494 మంది గెస్ట్ లెక్చరర్లను, 72 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అనగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సఫార్డినేట్లను రెన్యువల్ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి లభించింది.

ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే 398 మంది గెస్ట్ జూనియర్లను రెన్యువల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం రెన్యువల్ అయిన గెస్ట్ జూనియర్ లెక్చరర్ల సంఖ్య 892 కి చేరింది. గత విద్యా సంవత్సరం వరకు 1654 మంది బెస్ట్ జూనియర్ లెక్చరర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేశారు. అయితే టీజీపీఎస్సీ ద్వారా నియామకం పొందిన జూనియర్ లెక్చరర్లు విధుల్లో చేరడంతో వీరి సంఖ్య తగ్గింది.

గెస్ట్ లెక్చరర్ లకు నెలకు 28,080/-, డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు 19,500/-, ఆఫీస్ సబార్డినేట్ లకు 15,600/- రూపాయాలను గౌరవ వేతనంగా చెల్లిస్తారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →