BIKKI NEWS (JAN. 09) : Rationalization of teachers in Telangana. టీచర్ల హేతుబద్ధీకరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యాశాఖ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
Rationalization of teachers in Telangana.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉండాల్సి ఉండగా, ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉన్నట్లు సీఎం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో మిగిలిన టీచర్ల సేవలను వివిధ రూపాలలో వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది.
విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలల నుండి టీచర్లను విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు హేతుబద్ధీకరణ చేసే అవకాశం దీని ద్వారా లభిస్తుంది. చివరిసారిగా 2015లో టీచర్ల హేతుబద్ధీకరణ జరిగిన సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
