PM DHAN DHAANYA KRISHI YOJANA – 24 వేల కోట్లతో నూతన స్కీం

BIKKI NEWS (JULY) : PM DHAN DHAANYA KRISHI YOJANA. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం (Union cabinet decisions) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 24 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి ఆమోదం తెలిపింది.

PM DHAN DHAANYA KRISHI YOJANA.

దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని రూపొందించారు.

2025 – 26 నుంచి 6 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్టిపిసికి 20వేల కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి తిరిగి భూమికి వచ్చిన వ్యోమోగామి శుభాంశు శుక్లా ను అభినందిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.