BIKKI NEWS (DEC. 21) : NPS NEW GUIDELINES. జాతీయ పింఛన్ వ్యవస్థలో నూతన నిబంధనలను ప్రవేశ పెట్టారు.
NPS NEW GUIDELINES
యాన్యుటీల పరిమితిని 20 శాతానికి కుదించడం, 85 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎన్పీఎస్ లో కొనసాగేందుకు అనుమతించడం, కనీసం ఆరేళ్ల పాటు సిస్టమిక్ యూనిట్ రిడంప్షన్ ను అనుమతించడం ప్రధాన మార్పులు. మొత్తం మీద NPS లో పది ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి.
1) 85 ఏళ్ల వరకు కొనసాగడం…
ఇప్పటి వరకు NPS చందాదారులను 75 ఏళ్ల గరిష్ట వయసు వరకే ఈ పథకంలో కొనసాగేందుకు అనుమతించే వారు ఇప్పుడు ఈ వయోపరిమితిని 85 ఏళ్లకు పెంచారు.
ఈ వయసు తర్వాత తమ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకే సారి లేదా దశల వారీగా వెనక్కి తీసుకోవచ్చు.
ప్రభుత్వ ప్రభుత్వేతర (ప్రైవేట్) ఉద్యోగులు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వం ఉన్న NPS చందాదారులకు ఇది బాగా ఉపయోగపడనుంది..
2) యాన్యుటీల కొనుగోలు..
ఇంతకు ముందు ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో తమ ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.5 లక్షలకు మించి ఉంటే, అందులో 40. శాతం యాన్యుటీల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వచ్చేది ఇప్పుడు దాన్ని 20 శాతానికి కుదించారు.
3) 100 శాతం వెనక్కి
కొత్త నిబంధనల ప్రకారం కొన్ని కేసుల్లో చందాదారులు 100 శాతం మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. రిటైర్మెంట్ నాటికి NPS ఖాతాలో పోగైన మొత్తం 5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది.
అయితే ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే తమ ఖాతాల్లోని మొత్తంలో కనీసం 40 శాతంతో, ప్రైవేట్ ఉద్యోగులైతే తమ ఖాతాల్లోని మొత్తంలో 30 శాతం కనీస మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేసే ఆప్షన్ కల్పించారు
4) మరిన్ని విత్ డ్రాయల్స్,
NPS చందాదారులు ఇక రిటైరయ్యేలోపు అంటే 60-ఏళ్ల లోపు లేదా సూపర్యాన్యుయేషన్ లోపు నాలుగు విడతల వరకు తమ ఎన్పీఎస్ బాతా నుంచి సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఒక విత్ డ్రాయల్ కు మరోక విత్ డ్రాయల్ కు మధ్య కనీసం నాలుగేళ్ల వ్యవధి ఉండాలి. ఇంతకు ముందు ఇది మూడేళ్లుగా ఉండేవి.
5) 60 ఏళ్ల వయసు తర్వాత విత్ డ్రాయల్స్
పదవీ విరమణ లేదా 60 ఏళ్ల తర్వాత కూడా కొంతమంది. NPS లో చందాదారులుగా కొనసాగుతారు. వీరు కూడా మూడేళ్లకు ఒకసారి తమ చందా మొత్తం నుంచి 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు.
6) పౌరసత్వం వదులుకుంటే..
NPS చందాదారులు ఎవరైనా భారత పౌరసత్వం వదులుకుంటే ఆ వ్యక్తి తన ఎన్పీఎస్ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఖాతాలో జమైన మొత్తాన్ని వారికి ఒకే సారి చెల్లిస్తారు.
7) కనిపించకుండా పోయిన లేదా చనిపోయారని భావించే వ్యక్తుల విషయంలో
ఇలాంటి వ్యక్తుల నామినీలు లేదా చట్టబడ్డ వారసులకు, అప్పటి వరకు జమ అయిన మొత్తంలో 30 శాతాన్ని ఒకేసారి తాత్కాలిక ఊరటగా చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని చట్టపరంగా నిర్దారించుకున్న తర్వాత చెల్లిస్తారు.
8) ఖాతా ఆధారితం
ప్రతి ఎన్పీఎస్ ఖాతాకు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా (పీఆర్ఎ)’ పేరుతో ఒక నంబరు కేటాయిస్తారు. దీంతో ఖాతాదారుడి వివరాల గుర్తింపు తేలికవుతుంది.
9) సిస్టమిక్ యూనిట్ రిడంప్షన్..
ఎన్పీఎను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా సిస్టమిక్ యూనిట్ రిడంప్షన్ (SUR) ఆప్షన్ ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ అమలు చేస్తున్న సిస్టమిక్ విష్క్రియల్ ప్లాన్స్ (SWP) లాంటిది, అయితే ఈ ఆప్షన్ రిటైరయ్యే నాటికి తమ ఖాతాల్లో 8 లక్షల పైన, రూ.12 లక్షల లోపు ఉన్న ఎన్పీఎస్ చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది.
ఇలాంటి చందాదారులు ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని SUR ఖాతాకి మళ్లించి ఆరేళ్లలో వెనక్కి తీసుకోవాలి.
10) కొత్త శ్లాబులు..
ఎన్పీఎస్ ఖాతాల్లో రిటైరయ్యే నాటికి రూ.8 లక్షల పైన, రూ.12 లక్షల వరకు జమ అయిన వారి విత్ డ్రాయల్స్ కోసం కొత్త శ్లాబులు ప్రవేశపెట్టారు.
ఈ శ్లాబుల ప్రకారం….
ఆప్షన్ 1: ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకుని మిగతా మొత్తాన్ని SUR ల రూపంలో ఆరేళ్లలో వెనక్కి తీసుకోవచ్చు.
ఆప్షన్ 2: ఒకేసారి రూ.6 లక్షల వరకు వెనక్కి తీసుకుని, మిగతా మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేసుకోవడం.
ఆప్షన్ 3: రిటైర్మెంట్ ఖాతాలోని మొత్తంలో 60 శాతం వరకు ఒకేసారి పన్నుల బారిన పడకుండా వెనక్కి తీసుకుని మిగిలిన మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయడం.
ప్రభుత్వేతర ఉద్యోగులు మొదటి రెండు ఎగ్జిట్ ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. మూడో ఆప్షన్ ఎంచుకంటే మాత్రం వీరు 20 శాతం కార్పస్ తో యాన్యుటీలు కొని, మిగతా 80. శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు.

