Jee main results 2026: ఫలితాలు ఎప్పుడంటే? - bikki news

Jee main results 2026: ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్ (ఏప్రిల్ 09) : జేఈఈ మెయిన్‌ సెషన్‌ -2 (JEE Main results 2026 date) పరీక్షలు ముగిశాయి. వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తుంది ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 20 న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

JEE Main results 2026 date

రెండు సెషన్లలో అభ్యర్థులు సాధించిన మెరుగైన స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయి ర్యాంకులు ప్రకటిస్తారు.

అయితే, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced)కు ఏప్రిల్‌ 23 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నందున వీలైనంత త్వరగా జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ప్రిలిమినరీ కీని విడుదల చేసి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

అభ్యర్థులు తమ ఫలితాలను కింద ఇవ్వబడిన జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://jeemain.nta.nic.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →