Inter exams hall tickets 2026 - ఇంటర్ హాల్ టికెట్లు - bikki news

INTER EXAMS HALL TICKETS 2026 – ఇంటర్ హాల్ టికెట్లు

BIKKI NEWS (FEB. 17) : inter exams hall tickets 2026 will release on 18th February. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి హాల్ టికెట్లు ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు సమాచారం. కళాశాల లాగిన్ లో రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. (విద్యా వార్తలు.)

inter exams hall tickets 2026 will release on 18th February

ఫిబ్రవరి 20న విద్యార్థులు, తల్లిదండ్రుల రిజిస్టర్డ్ వాట్సాప్ నకు హాల్ టికెట్లను పంపిస్తారు. అలాగే అధికారిక బోర్డు వెబ్ సైట్ లో కూడా హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

విద్యార్థులు తమ హాల్ టికెట్ లోనై పేరు, ఫొటో, సబ్జెక్ట్ , మీడియం వంటి వివరాలు తప్పులు దొర్లితే కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకునే అవకాశం కల్పించారు. ప్రివ్యూ హాల్ టికెట్ లను కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈసారి ఇంటర్ హాల్ టికెట్ల పై QR కోడ్ ను ముద్రిస్తున్నారు. పరీక్షకేంద్రం రూట్ మ్యాప్ తో అనుసంధానించారు.

పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి దాదాపు 9,96,529 మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు. వీరికోసం 1,495 సెంటర్లు ఏర్పాటు చేశారు.

INTERMEDIATE PREVIEW HALL TICKETS 2026

FIRST YEAR PREVIEW HALL TICKETS

SECOND YEAR PREVIEW HALL TICKETS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →