BIKKI NEWS (SEP. 08) : Heavy rains in Telangana next 3 days. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం క్రమంగా పెరుగుతుండడంతో.. సెప్టెంబర్ 9, 10,11వ తేదీల్లో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
Heavy rains in Telangana next 3 days
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో గాలివానలు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
ముఖ్యంగా పగలంతా ఎండ కాస్తూ సాయంత్రం, రాత్రి వేళల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
