BIKKI NEWS (FEB. 17) : GK BITS PART 99 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS PART 99 FOR COMPITITIVE EXAMS
1) ఇండియా లీగ్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1875
2) థర్మాస్ ప్లాస్క్ ను తయారు చేసింది ఎవరు.?
జ : జేమ్స్ దేవర్
3) శూన్యంలో ఉష్ణం ప్రసరించడాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఉష్ణ వికిరణం
4) ఏ రకమైన లోపం ఉన్న వ్యక్తులు ఒకేసారి అడ్డుగీతలను, నిలువుగీతలను చూడలేరు.?
జ :అసమదృష్ఠి
5) నీటిలో ఏటవాలుగా మునిగిన కర్ర వంగినట్లు కనపడే కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి వక్రీభవనం
6) సివి రామన్ కు ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది.?
జ : కాంతి పరిక్షేపణం
7) జన్యు సంబంధమైన లోపం కారణంగా ఏర్పడే కంటి వ్యాధి ఏమిటి.?
జ : వర్ణాంధత్వము
8) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన పలు ప్రాజెక్టుల కోసం చేయించిన సర్వే పేరు ఏమిటి.?
జ : LIDAR సర్వే
9) చీకటి లో ఫోటోలు తీయడానికి, గోడలపై ఉన్న చిత్రాలను తొలగించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : పరారుణ కిరణాలు
10) ఫింగర్ ప్రింట్ విశ్లేషణకు, దొంగ నోట్లు, దొంగ డాక్యుమెంట్లను గుర్తించడానికి ఉపయోగించి కిరణాలు ఏవి.?
జ : అది నీలలోహిత కిరణాలు
11) సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో సూర్యుడు ఎర్రగా, మధ్యాహ్న సమయంలో తెల్లగా కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి పరిక్షేపణం
12) హలోగ్రఫీ కనుగొన్నందుకు 1971లో ఏ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించింది.?
జ : గాబర్
13) కొంత ఎత్తు నుండి కింద పడే వస్తువులో స్థిరమైనది ఏది.?
జ : త్వరణం
14) మానవుని చెవి గుర్తించే ధ్వని అవధి ఎంత.?
జ : 20 నుంచి 20వేల హెర్జ్ లు
15) రేడియోధార్మికత ప్రమాణం ఏమిటి.?
జ : బెకరల్
16) కాంతి యానకం మారినప్పటికీ మారని లక్షణం ఏమిటి.?
జ : ఫౌనఃపున్యం
17) కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం.?
జ : దూరం
18) విద్యుత్తును కొలిచే సాధనం ఏమిటి.?
జ : అమ్మీటర్
19) సబ్బు నీటి బుడగపై కాంతి పడినప్పుడు వివిధ రంగులు వెదజల్లడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి వ్యతికరణం
20) వేసవిలో ఫ్యాన్ కింద ఉన్న వ్యక్తి చల్లని అనుభూతి పొందడానికి కారణం ఏమిటి.?
జ : చెమట త్వరగా ఆవిరైపోవడం
21) అల్యూమినియం లోహం యొక్క ముఖ్య ధాతువు ఏమిటి.?
జ : బాక్సైట్
22) వాటర్ హీటర్ ఫిలమెంట్లో వాడే మిశ్రమాల్లోహం ఏది.?
జ : నిక్రోమ్
23) అత్యంత శుద్ధ ఇనుప రూపాంతరం ఏది.?
జ : చేత ఇనుము
24) అత్యంత అశుద్ధ ఇనుప రూపాంతరం ఏది.?
జ : పోత ఇనుము
25) తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన భారత రాష్ట్రపతి ఎవరు.?
జ : ప్రణబ్ ముఖర్జీ
26) నానాఘాట్ శాసనం ప్రకారం దక్షిణ పదాపతి అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు.?
జ : మొదటి శాతకర్ణి
27) దేశంలోనే మొదటిసారి వంద శాతం కులాయి నీటిని అందించిన రాష్ట్రం ఏది? జ : గోవా
28) తెలంగాణ చరిత్ర, రాజకీయ, సామాజిక సంస్కృతి ఏ రాజుల కాలం నుండి ప్రారంభమవుతుందని భావిస్తారు.?
జ : శాతవాహనలు
29) 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభాలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది?
జ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
30) బ్రహ్మపుత్ర నదిలోయ ప్రాంతంలో వరి పొలాలను కలిపే చిన్న నీటి మార్గాలను ఏమంటారు.?
జ : డాంగ్లూ

