BIKKI NEWS (FEB. 15) : INDIA WON AGAINST PAKISTAN IN ICC T20 WORLD CUP. టీమిండియా పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఐసీసీ t20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
INDIA WON AGAINST PAKISTAN IN ICC T20 WORLD CUP
ఇది భారత్ కు వరుసగా ఈ టోర్నీలో మూడో విజయం. దీంతో భారత్ సూపర్ 8 కు చేరుకుంది.
శివరాత్రి వేళ టీమిండియా భారతీయులకు నిజమైన పండుగ వాతావరణాన్ని కల్పించింది. ఇది భారత్ కు శివరాత్రి కాగా పాకిస్తాన్ అభిమానులకు కాళరాత్రి గా మారింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకు ఇషాన్ కిషన్ (77) వీరబాదుడుతో టీమిండియా భారీ స్కోరును (175/7) సాధించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 32, దూబే – 27, తిలక్ వర్మ – 25 పరుగులతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ జట్టుకు బూమ్ బూమ్ బుమ్రా గట్టి షాక్ ఇచ్చాడు. అనంతరం స్పిన్నర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఏ సమయంలోనో పాకిస్తాన్ జట్టు పోటీలోకి రాలేదు. ఉస్మాన్ ఖాన్ (44) పరుగులతో మాత్రమే రాణించాడు.
భారత బౌలర్లలో బుమ్రా – 2, అక్షర్ పటేల్ – 2, వరుణ్ చక్రవర్తి – 2, పాండ్యా 2 వికెట్లతో రాణించారు.
ఐసిసి టి20 వరల్డ్ కప్ లలో భారత్ పాకిస్తాన్ జట్లు 9సార్లు తలపడగా భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
