TELANGANA MODEL SCHOOL EXAM 2026 – మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Model school entrance test
  • BIKKI NEWS : 15-02-2026

Telangana Model school exam 2026 notification. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లలో 6వ తరగతి మరియు 7 నుంచి 10 తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్లు భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Model school exam 2026 notification

2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పిస్తారు. జనవరి 17వ తేదీన పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.

అర్హత గల విద్యార్థులు జనవరి 28 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఏప్రిల్ 9వ తేదీ నుండి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Telangana model school entrance tests 2026

19 ఏప్రిల్ నా మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు

పరీక్షా కేంద్రాలుగా సంబంధిత మండలంలోని మోడల్ స్కూల్ లను ఎంపిక చేస్తారు.

6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు, ఏడు నుండి పదవ తరగతి విద్యార్థుల కొరకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : 200/- రూపాయాలు. (EWS, PwD, SC, ST, BC – 115/- రూపాయలు)

పూర్తి వివరాలు, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ : tgms.telanagana.gov.in

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →