BIKKI NEWS (MAR. 23) : DA ARREARS PENDING BILLS CLEAR SOON SAYS BHATTI. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉద్యోగులపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
DA ARREARS PENDING BILLS CLEAR SOON SAYS BHATTI
తమ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 6,146 కోట్ల రూపాయల బకాయిలను క్లియర్ చేశామని ఆయన ప్రకటించారు.
ఉద్యోగులు గతంలో 15వ తేదీ వరకు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రతి నెలా 700 కోట్లు చెల్లిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని 1,000 కోట్లకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు భట్టి పేర్కొన్నారు.
పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల డిమాండ్‌ను నెరవేరుస్తూ, త్వరలోనే ఉద్యోగులకు పూర్తి స్థాయి నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
కొత్త పీఆర్సీ నివేదిక రాగానే అమలుపై నిర్ణయం తీసుకుంటామని, పెండింగ్ లో ఉన్న 4 డీఏలపై కూడా సానుకూల నిర్ణయం ఉంటుందని హామీ ఇచ్చారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
