Employee – ఉద్యోగి కట్టుబానిస కాదు – కేరళ హైకోర్టు

An employee is not a slave says Kerala high court

BIKKI NEWS (FEB-15) : An employee is not a slave says Kerala high court. ఉద్యోగి రాజీనామా లేఖను ఆమోదించకపోవడం ఉద్యోగిని కట్టు బానిసలా చూడడమే అవుతుందని కేరళ హైకోర్టు ఓ కేసు విషయంలో పేర్కొంది.

An employee is not a slave says Kerala high court

ఉద్యోగ నియామక ఒప్పందంలో ఏవైనా షరతులు ఉంటే మినహా ఉద్యోగి రాజీనామా లేఖను యాజమాన్యం వెంటనే ఆమోదించాల్సిందేనని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని 23వ అధికరణం వెట్టి బానిస విధానాన్ని రద్దు చేసిందని, అందువల్ల ఉద్యోగి రాజీనామాను కంపెనీ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఈ కేసులో పిటిషనర్ తండ్రి 2020లో మరణించారు. ఆయన తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె సంరక్షణ చూసుకోవడానికి పిటిషనర్ ఉద్యోగం మారాల్సి రావడంతో 2020లో ప్రభుత్వ రంగ సంస్థలో సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.

అయితే దాన్ని సంస్థ ఆమోదిస్తే తప్ప వేరే ఉద్యోగం చూసుకోలేరు. కానీ, ఆర్థిక కారణాలను చూపి యాజమాన్యం ఆయన రాజీనామాను తిరస్కరించింది. 2022 అక్టోబరు నుంచి తనకు జీతం చెల్లించడమూ మానేసిందని పిటిషనర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో పిటిషనర్ రాజీనామాను వెంటనే ఆమోదించి, జీతం బకాయిలు, గ్రాట్యుటీ, పీఎఫ్ తదితరాలను రెండు నెలలలోపు చెల్లించాలని సంస్థను హైకోర్టు ఆదేశించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →