EHS 2026 – ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది.?

Telangana employees health scheme - bikki news
  • BIKKI NEWS : 13-02-2026

EHS 2026 – TELANGANA EMPLOYEES HEALTH SCHEME. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ ల కోసం నూతన ఆరోగ్య పథకం ను ప్రకటించింది. దీనిని 15 రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు.

EHS 2026 – TELANGANA EMPLOYEES HEALTH SCHEME

ఈ నూతన పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ లు, వారి కుటుంబ సభ్యులు నగదు రహిత చికిత్సలను అందుకోనున్నారు.

EHS పథకం కోసం ఏటా 1056 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగో తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్ పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది.

నగదు రహిత వైద్య సేవల కోసం 515 ఆసుపత్రులను ప్రస్తుతానికి గుర్తించారు.

ప్రస్తుతం పోలీసు శాఖకు ఆరోగ్య భద్రత పథకం, ఎక్సైజ్ శాటకు సహాయత పథకం పేరిట వైద్య పథకాలు అమల్లో ఉన్నాయి. ఆ శాఖల ఉద్యోగులను కూడా ఈ EHS లో చేరుస్తారు.

బేసిక్ పే లో‌ 1.5% చెల్లించాల్సి ఉంటుంది. సమానంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.

1.5 శాతం కంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుందని సంఘాలు అభిప్రాయపడగా.. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, భవిష్యత్తులో తగ్గించే అవకాశం ఉందని అధికారులు సమాధానమిచ్చారు.

ప్రభుత్వరంగ సంస్థలు, మోడల్, ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి.. పథకం ప్రారంభమైన తర్వాత ట్రస్టులో తీర్మానం చేసి వర్తింపజేస్తారు.

సరిహద్దు జిల్లాల్లో ఉన్న వారు పక్క రాష్ట్రాల్లో అత్యవసరంగా చికిత్స పొందినప్పుడు ఈహెచ్ఎస్ వర్తింపజేసే విషయం పరిశీలిస్తారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →