- BIKKI NEWS : 30-01-2026
Mid day meals in Government junior colleges. తెలంగాణ రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
Mid day meals in Government junior colleges
జనవరి 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య ఈ అంశాన్ని ప్రతిపాదించారు.
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే జూనియర్ కళాశాలల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో పాఠశాల పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంపై ఇంటర్ విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సగటున విద్యార్థుల హాజరు 60 శాతం వరకు మాత్రమే ఉంటోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తే హాజరు శాతం 70 నుంచి 80 శాతం వరకు పెరుగుతుందని అధి కారులు అంచనా వేస్తున్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
