- BIKKI NEWS : 20-01-2026
MINORITY GURUKULA 5th CLASS ADMISSIONS 2026. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్లు భర్తీ చేయడానికి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు.
MINORITY GURUKULA 5th CLASS ADMISSIONS 2026
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు అవకాశం కలదు.
5 వ తరగతి ప్రవేశాల కొరకు విద్యార్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4 వ తరగతి చదువుతూ ఉండాలి.
6, 7, 8వ తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశాలకు ముందు తరగతి చదువుతూ ఉండాలి.
మైనారిటీ విద్యార్థులకు 75% సీట్లు, ఇతర విద్యార్థులకు 25% సీట్లు కేటాయిస్తారు.
మైనారిటీల విద్యార్థులకు మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట సీట్లను కేటాయిస్తారు.
ఇతర అభ్యర్థులకు లక్కీ డీప్ ద్వారా సీట్లు కేటాయిస్తారు.
5వ తరగతి మరియు బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ఎప్రిల్ 24 నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది.
వెబ్సైట్ : https://cet.cgg.gov.in/tmreis

