BIKKI NEWS (JAN. 07) : Telangana Chief ministers cup 2025 2nd edition schedule. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ -2025 పోస్టర్ ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ క్రీడాపోటీలకు సంబంధించి అవగాహన కల్పించడానికి ఈ నెల 8 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు పది రోజుల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది.
Telangana Chief ministers cup 2025 2nd edition schedule
ఆ తర్వాత ఈ నెల 17 వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వ తేదీ వరకు వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. డిసెంబర్ నెలలో జరగాల్సిన ఈ క్రీడలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ పోటీలను నిర్వహించనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి గారు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ గారు, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు గారు, SATG ఎండీ సోనీబాల గారు పాల్గొన్నారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
