BIKKI NEWS (JAN. 07) : Telangana Employees DA News. తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా డియర్ నెస్ అలవెన్స్ (DA) అందించే అవకాశం ఉందని సమాచారం.
Telangana Employees DA News
2026 జనవరి నాటికి ఉద్యోగులకు సంబంధించి మొత్తం 6 డిఏ లు పెండింగ్ లో ఉన్నాయి. ఇన్ని డిఏలు పెండింగ్ లో ఉండటం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా తొలిసారి కావడం విశేషం.
గత డీఏ విడుదల సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులలో డిసెంబర్ 2025లో మరో డీఏ విడుదల చేస్తామని పేర్కొన్నారు. కానీ డిసెంబర్ నెల గడిచిపోయి జనవరి నెల ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు డీఏ విడుదల చేయలేదు. దీనిపట్ల ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో శాసనసభ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడతానని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఒక డిఏ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
