Anti drug pledge - విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ - bikki news

Anti drug pledge – విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

BIKKI NEWS (June 19) : Anti drug pledge with students by CM and Governer. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు విద్యార్థినీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

Anti drug pledge with students by CM and Governer

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, సలహాదారు కె. కేశవరావు గారితో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎల్ బీ స్టేడియం వేదికగా గవర్నర్ గారు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

“నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్గర్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →