Employees jac met bhatti - నేటి చర్చల సారాంశం - bikki news

Employees JAC Met Bhatti – నేటి చర్చల సారాంశం

BIKKI NEWS (MAY 01) : Employees JAC Met Bhatti today on various issues. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి తో ప్రజా భవన్ లో జరిపిన చర్చల్లో పలు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై చర్చించి క్రింది విషయాలపై ప్రాతినిధ్యం సమర్పించడం జరిగింది.

Employees JAC Meets Bhatti today on various issues

1) పి ఆర్ సి.నివేదిక తెప్పించి ఫిట్మెంట్ ప్రకటించాలి

2) పెండింగ్ డి ఏ లు, అన్ని రకాల పెండింగ్ బిల్లులను సత్వరం చెల్లించడానికి ఆదేశాలు ఇవ్వగలరు.

3) 317 జీవో ఉపాధ్యాయ బాధితులకు ఉపశమనం కలిగేలా 190 జీవోను విద్యా శాఖ అమలు చేయలేదు అమలుపరచగలరు.

4) మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగ ఉపాధ్యాయ అంశాలను వెంటనే పరిష్కరించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించగలరు.

5) కేంద్ర ప్రభుత్వ సర్కులర్ అనుగుణంగా 2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయగలరు.

6) ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇస్తానన్న ఈహెచ్ఎస్ కార్డులను లను వెంటనే అమలుపరచగలరు.

7) కేజీబివి మహిళా ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ వారికి మినిమం టైం స్కేల్ ను అమలు పరచగలరు. వారికి బదిలీలకు బదిలీలకు అవకాశం ఇవ్వగలరు. వారి సమ్మె కాలపు వేతనాన్ని కూడా చెల్లించేలా చూడగలరు.

8) మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా శాలరీలను ఇప్పించగలరు.

9) విద్యాశాఖలో ఉపాధ్యాయులకు వార్షిక పదోన్నతుల, బదిలీల క్యాలెండర్ ను విడుదల చేయగలరు.
10.జులై 31 కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయం చేస్తూ,పదోన్నతులతో కూడిన బదిలీలు చేయగలరు.

11) అన్ని గురుకులాల సొసైటీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆయా గురుకులంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించగలరు.

12) ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించుటకు జూన్ మాసంకు ముందే పాఠశాలలకు పూర్తి గ్రాంట్లు విడుదల చేసి మౌలిక వసతుల కల్పన కు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సంబంధించిన నిధులను మరో మారు విడుదల చేయగలరు.

13) గతంలో పెండింగ్ లో ఉన్న AAPC వర్క్ బిల్లులు చెల్లింపులు చేయించగలరు.

14) ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను సత్వరం పరిష్కారం చేయటానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలి.

15) విద్యా శాఖ లో ఇంకా పరిష్కారం కు నోచుకోని 317 GO భాదిత ఉపాధ్యాయుల అంతర్ జిల్లా స్పావుజ్ బదిలీలను చేయాలి.

16) టెట్ మినహాయింపు వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రంలో అర్హత మార్కులను అందరికీ ఒకే విధంగా ఉండేలా చూస్తూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ ను నిర్వహించేలా చూడగలరని కోరనైనది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక వారం రోజుల లోపు సానుకూలమైనటువంటి నిర్ణయము తీసుకుంటామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్లు సమాచారం.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల పెండింగ్ బిల్లుల పట్ల, పిఆర్సి పట్ల, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల, ఇతర సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →