BIKKI NEWS (APRIL 20) : Telangana Employees Transfers very soon. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేయాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనగణన ఉన్నప్పటికీ, బదిలీలు వద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ మధ్యే మార్గంగా బదిలీలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Telangana Employees Transfers very soon.
జనగణన లో పాల్గొంటున్న ఉద్యోగులకు బదిలీల్లో చోటు కల్పించి జనగణన పూర్తయ్యే వరకు, రీ లీవ్ ఆప్షన్ ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రెండేళ్లు పూర్తికాని ఉద్యోగులకు బదిలీల్లో ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే స్పౌజ్ , హెల్త్ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదటి విడత జనగణన పూర్తయ్యేలోపే అనగా జూన్ మాసం వరకు బదిలీల ప్రక్రియ చేపట్టే అవకాశం కనబడుతోంది. దీనిపై సీఎం నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

