Ops - ఆ ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు చేయాల్సిందే - హైకోర్టు - bikki news

OPS – ఆ ఉద్యోగులకు పాత పెన్షన్‌ అమలు చేయాల్సిందే – హైకోర్టు

BIKKI NEWS (APRIL 09) : OPS FOR EMPLOYEES APPOINTED BEFORE 2024 SEPTEMBER 1st. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 01 – 200 4కు ముందు వెలువడ్డ నియామక నోటిఫికేషన్ల ద్వారా ఎంపిక కాబడి, ఆ తేదీ తర్వాత ఉద్యోగాలలో నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

OPS FOR EMPLOYEES APPOINTED BEFORE 2024

ఒకవేళ పాత పెన్షన్ ను 2026 జూన్ 10వ తేదీ లోపల అమలు చేయకపోతే అధికారులు కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని.. జస్టిస్‌ సామ్‌కోషి, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.

జూన్‌ 10న లోపు అమలు చేయకపోతే అదే రోజు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్‌ సుల్తానియాలను ఆదేశించింది.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

ఈ అంశంపై న్యాయశాఖలోని ఉద్యోగులు దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా వీరందరికీ పాత పెన్షన్‌ విధానం అమలు చేయడానికి వీలుగా గతంలోనే ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

1-9-2004కు ముందు నియామక నోటిఫికేషన్లన్నీ కూడా పాత పెన్షన్‌ విధానం వర్తింపు కిందే జారీ అయ్యాయని.. 2004 సెప్టెంబరు 1 తర్వాత నియామకాలన్నీ CPS కింద జరిగాయని ఉద్యోగులు వాదిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు డిస్కమ్‌లతో పాటు వివిధ శాఖల్లో ఇలా 13 వేల మంది ఉద్యోగులు పాత పెన్షన్‌ విధానం అమలుకు మార్గం సుగమమైంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →