Elephants Day – ప్రపంచ ఏనుగుల దినోత్సవం

BIKKI NEWS (AUG. 12) : world elephants Day August 12th. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీన నిర్వహించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏనుగులను కాపాడి సంరక్షించడానికి 2012లో ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది.

world elephants Day August 12th.

ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులకు కూడా భావోద్వేగాలుండటమే కాకుండా తెలివి, జ్ఞాపకశక్తి ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. దంతాల కోసం, ఇతర శరీర భాగాల కోసం ఏనుగులను చంపేయడంతో, వాటి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది.

ఏనుగుల కోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరిగుతుందన్న ఉద్దేశ్యంతో కెనడాలోని కెనజ్వెస్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాతలు ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్‌, మైఖేల్ క్లార్క్ 2011లో దీనిని రూపొందించారు. థాయిలాండ్ లోని ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012, ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రారంభించబడింది.

అప్పటి నుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65 కు పైగా వన్యప్రాణుల సంస్థలు, చాలామంది వ్యక్తులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు