జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో ఓటర్ దినోత్సవ కార్యక్రమం - bikki news

జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో ఓటర్ దినోత్సవ కార్యక్రమం

  • BIKKI NEWS : 24-01-2026

Voters day celebrations in GJC GIRLS HUSNABAD. ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Voters day celebrations in GJC GIRLS HUSNABAD

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి మ. లలిత గారు అధ్యక్షత వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం విద్యార్థినిలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను చేయడం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వి లలిత గారు మాట్లాడుతూ… ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తెలుపుతూ సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునే బాధ్యత ఓటర్ల పైన ఉందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. సమాజంలోని పౌరులందరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

అనంతరం కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి టీ. నిర్మలాదేవి గారు మాట్లాడుతూ ఓటర్ దినోత్సవం ఆవిర్భావం మరియు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. అనంతరం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటు హక్కు నమోదు చేసే బాధ్యత విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పైన ఉందని తెలుపుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని తెలిపారు.

ఈ కార్యక్రమాలలో కళాశాల అధ్యాపక బృందం ఏ సంపత్, డి రవీందర్, ఏ సదానందం, శ్రీమతి టి నిర్మలాదేవి, ఎస్ కవిత, కే స్వరూప, జి కవిత కుమారి, ఓ రాణి, జూనియర్ అసిస్టెంట్ కే గీతాంజలి, జూనియర్ అసిస్టెంట్ ఎస్ రాములు, విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →