BIKKI NEWS : TOP GK BITS PART 100 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు స్టాండర్డ్ జీకే బిట్స్ .
TOP GK BITS PART 100 FOR COMPITITIVE EXAMS
1) ఆమ్ల క్షార చర్యలలో ఉత్పన్నంగా ఏర్పడే పదార్థం ఏమిటి.?
జ : లవణం
2) భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పొందుపరిచారు.?
జ : భాగం – 3
3) కృత్రిమ ఇన్సులిన్ ను ఏ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.?
జ : ఈ కోలై డీఎన్ఏ
4) గాయాలైనప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పొటాష్ ఆలం
5) తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలోకి ఆమ్లం ప్రవేశిస్తుంది దీన్ని తటస్థీకరించడానికి ఉపయోగించే రసాయనం ఏది.?
జ : బేకింగ్ సోడా
6) PH స్కేలును రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు?
జ : సోరెన్ సెన్
7) లంచం తీసుకునే వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నగదు కు పూసే రసాయనం ఏమిటి.?
జ : ఫినాఫ్తలిన్
8) పాలకూర, టమాటా లలో ఉండే ఆమ్లం ఏమిటి.?
జ : ఆగ్జాలిక్ ఆమ్లం
9) జాతీయ నది సంరక్షణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1995
0) సముద్రపు నీటి నుండి మంచినీటినే తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి పేరు ఏమిటి.?
జ : తిరోగమన ద్రవాభిసరణం
11) “భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర” అనే గ్రంథం రాసినది ఎవరు.?
జ : పట్టాభి సీతారామయ్య
12) ఏ మృత్తికలను భారతదేశ ధాన్యగారాలు అని అంటారు.?
జ : ఓండ్రు మృతికలు
13) తమను తామే దున్నుకునే నేలలు అని ఏ మృతికలను అంటారు.?
జ : నల్లరేగడి మృత్తికలు
14) భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి? జ : ఒండ్రు నేలలు (~43%)
15) లేటరైట్ మృత్తికలు అనే పదంలో లేటరైట్ కు అర్థం ఏమిటి.?
జ : ఇటుక
16) కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ ను ఎవరు రూపొందిస్తారు.?
జ : కేంద్ర ప్రభుత్వం
17) బడ్జెట్ ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ లో ఏమని ఉంది.?
జ : అర్టికల్ – 112 (యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్)
18) భారతదేశంలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరు.?
జ : మమతా బెనర్జీ
19) భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమం పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : హోమీ జహంగీర్ బాబా
20) స్మైలింగ్ బుద్ధ కోడ్ తో భారతదేశం తన మొట్టమొదటి అణు పరీక్షలను పోఖ్రాన్ లో ఎప్పుడు నిర్వహించింది.?
జ : 1974 మే -18
21)జాతీయ సాంకేతిక దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు ?
జ : మే 11
22) ప్రపంచంలో అతిపెద్ద భూకంప బెల్ట్ ఏది.?
జ : సర్కమ్ పసిఫిక్
23) పేదరిక విష వలయం గురించి వివరించినది ఎవరు.?
జ : రాగ్నార్ నర్క్స్
24) అంతర్జాతీయ పేదరిక రేఖ ఎన్ని డాలర్ల వద్ద కలదు.?
జ : 1.90 డాలర్లు
25) దండేకర్ – రద్ ల పేదరిక సూచీలో ప్రామాణికంగా ఏమి తీసుకున్నారు.?
జ : కనీస వినియోగ కేలరీలు
26) దేశ భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం ఏదో ఒక విపత్తుకు గురవుతుంది.?
జ : 85%
27) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుంటాయి.?
జ : 58%
28) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో తుపాను లు సంభవిస్తుంటాయి.?
జ : 8%
29) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో వరదలు సంభవిస్తుంటాయి.?
జ : 15%
30) బుందేల్ ఖండ్ ప్రాంతం ఎక్కడ కలదు?
జ : యమునా నదికి దక్షిణ భాగం – దక్కన్ పీఠభూమి కి ఉత్తర భాగం

