Today Iin history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 29

Today iin history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 29 - bikki news

BIKKI NEWS: Today Iin history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 29

Today Iin history august 29

దినోత్సవం

సంఘటనలు

1842: నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
1885: గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
1898: గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
1910: జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
1915: యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
1916: ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
1930: సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
1944: స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
1949: సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
1957: స్ట్రామ్ థర్మాండ్, అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
1958: యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
1965: అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
1966: బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌‍ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
1982: కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
1986: బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
1991: సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
2005: హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది.

జననాలు

1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)
1902 : వెరియర్ ఎల్విన్, రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు.
1905: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979)
1926: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .
1928: రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
1943: విజయ కుమార్ , తమిళ మలయాళ, హిందీ,తెలుగు చిత్రాల నటుడు , రాజకీయ నాయకుడు .
1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009)
1959: అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
1961: నాగబాబు, తెలుగు చిత్రసీమ నటుడు , నిర్మాత
1974: దామరకొండ ప్రవీణ్ కుమార్, రైతు సమితి మండల కో-ఆర్డినేటర్, మాజీ సర్పంచ్, అమీనాపురం గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
1975: విశాల్ కృష్ణ, తమిళ, తెలుగు , చిత్రాల నటుడు , నిర్మాత .
1981: ప్రత్యూష , తెలుగు ,తమిళ, చిత్రాల నటి(మ.2002).
1989: హీనా సిద్ధూ, భారతీయ షూటింగ్ క్రీడాకారిణి.
1991: హరిప్రియ, సినీనటి, భరత నాట్య కళాకారిణి ,మోడల్ .

మరణాలు

1950: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888)
1976: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899)
2018: నందమూరి హరికృష్ణ, సినిమా నటుడు, ఎన్. టి.రామారావు కుమారుడు, కారు ప్రమాదంలో గాయపడి మరణం. (జ.1956)
2022: అభిజిత్ సేన్ ఆర్థికవేత్త. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. (జ.1950)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →