BIKKI NEWS (AUG. 29) : National Sports day on August 29th. జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు.
National Sports day on August 29th.
భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ (1905 ఆగష్టు 29, – 1979) డిసెంబరు 3, తన గోల్ స్కోరింగ్ విన్యాసాలతో, మొదట ఆటగానిగా , తర్వాత కెప్టెన్ గా గుర్తించబడ్డాడు. ధ్యాన్ చంద్ తన జట్టుతో మూడు ఒలింపిక్ బంగారు పతకాలు (1928 ఆమ్‌స్టర్‌డ్యామ్, 1932 లాస్ ఏంజెల్స్, 1936 బెర్లిన్) సాధించాడు.
ఇతను భారత ప్రభుత్వంచే 1956లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. దీంతో గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్‌చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజున ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవమును జరుపుకుంటారు.
ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు
ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు “మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న” గా ప్రకటించింది

