కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగుల జేఏసీ భేటీలో నిర్ణయాలు

BIKKI NEWS (SEP. 02) : Today cabinet sub committee meeting decisions with employees. ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకుఈరోజు సచివాలయంలో రాష్ట్ర కాబినెట్ సబ్ కమిటి, అధికారుల కమిటితో తెలంగాణ ఎంప్లొయీస్ టీచర్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ సమావేశం జరిగింది.

Today cabinet sub committee meeting decisions with employees

పెండింగ్ సమస్యల పరిష్కారం లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. మల్లు, ఐటీ, ఇండస్ట్రీస్ మరియు పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ డి . శ్రీధర్ బాబు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి – రామ కృష్ణారావు ఆద్వర్యంలోని అధికారుల కమిటీ తో ఉద్యోగుల జేఏసి తో ప్రతి అంశంపై సానుకూలమైన వైఖరితో చర్చలు జరిగాయని జేఏసీ నాయకులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుండో కోరుతున్న నగదు రహిత చికిత్స కొరకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని దీనికొరకు సోమవారం 08-09-2025 నాడు ప్రధాన కార్యదర్శి – రామ కృష్ణారావు జేఏసీ తో అధికారుల కమిటీ చర్చించి విధి విధానాలతో ఉత్తర్వులు జారీచేస్తామని ఖచ్చితమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని అన్నారు .

పెండింగ్ బిల్లులను నెలకు 700 – 750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామని, నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిపారు.

విజిలెన్సు , ఏసీబి కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు 2 సంవత్సరాలకు పైగా సస్పెన్షన్ లో ఉన్నవారికి క్రమంగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు ప్రభుత్వం వేరు వేరు కాదని, సుపరిపాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చినట్లు నాయకులు తెలిపారు.