BIKKI NEWS (SEP. 20) : TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
TGPSC GROUP 3 CERTIFICATE VERIFICATION SCHEDULE
మొత్తం 1,388 పోస్టుల భర్తీకి 2024 నవంబరులో రాతపరీక్షలు నిర్వహించగా.. 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో 18364 మందిని కమిషన్ అనర్హులుగా కమిషన్ ప్రకటించింది. మిగతా 2,49,557 మంది అభ్యర్థులతో జీఆర్ఎల్ ను మార్చి 14న వెల్లడించింది.
మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు జూన్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల నేపథ్యంలో వాయిదా వేసింది.
గ్రూప్-2 తుది ఫలితాల వెల్లడికి పరిపాలన ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్-3 కింద సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు కార్యాచరణను కమిషన్ రూపొందిస్తోంది.