BIKKI NEWS (MAR. 12) : Telangana Police Constable jobs vacancies 2026. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 26 నాటికి 17 వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది.
Telangana Police Constable jobs vacancies 2026.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి దాదాపు 50 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇంకా 17 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రతి ఏడాది 6 నుండి 7వేల వరకు పోలీస్ కానిస్టేబుల్స్ పదవీ విరమణ పొందడమే.
శాంతి భద్రతలతో ముడిపడిన శాఖ కాబట్టి పోస్టుల భర్తీని వెంట వెంటనే చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఖాళీల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రస్తుతం ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. ప్రభుత్వం అనుమతి లభించిన వెంటనే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించనుంది.
- TGPSC Deputy EO job notification 2026 – డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్
- Today Gold Rate June 5th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TGPSC – మరో 1597 ఉద్యోగాలకు ఈనెలలో నోటిఫికేషన్ – వివరాలు
- TGCET 2026 2nd Phase Result – గురుకుల ఐదో తరగతి 2వ జాబితా
- Special TET for in service teachers – ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్
