OPS అమలు చేస్తే సీఎం చరిత్రలో నిలుస్తారు : TGEJAC

BIKKI NEWS (SEP. 01) : TGEJAC PROTEST TODAY AGAINST CPS. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరం లోపు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని TGEJAC చైర్మన్  మారం జిగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్ లు ఏకవాక్య  తీర్మానం చేశారు.

TGEJAC PROTEST TODAY AGAINST CPS.

ఈ రోజు హైదరాబాద్ RTC కళ్యాణమండపం లో సీపీఎస్ రద్దు కోరుతూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో  చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 1, 2004న సిపీఎస్ విధానం ప్రవేశపెట్టి 20 ఏళ్ళు అవుతున్న మా పెన్షన్ లో ఏ ఒక్క ఉద్యోగి కుటుంబం వారికి భద్రత భరోసా  కల్పించబడలేదు. ప్రభుత్వానికి నయాపైస భారం కాని సిపిఎస్ లో రద్దుచేసి, షేర్ మార్కెట్ కు  ప్రతినెల తరలి వెళ్లే 450 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి వినియోగించాలని, ఈ విధానం వల్ల అటు ప్రభుత్వ ఆదాయం, ఉద్యోగుల ఆదాయం, ఉద్యోగి 10% జీతం షేర్ మార్కెట్ పాలవుతుందని వాపోయారు. పాత పెన్షన్ పునరుద్ధరించడం వల్ల ఉద్యోగి సేవలో మరింతగా వినియోగించుకుని తెలంగాణ అభివృద్ధి లో ముందు ఉందని తెలిపారు.

వివిధ నాయకుల ఉపన్యాసం

జె.ఏ. సి సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ చేసిందని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మానిఫెస్టో లో పెట్టిన విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యమైనంత తొందరగా చెయ్యాలన్నారు.

సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ రావు గారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరం లోపు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని తీర్మానం ప్రవేశ పెట్టగా ఏక వాక్యంతో సభ ఆమోదం తెలిపింది.

స్థితప్రజ్ఞ మాట్లాడుతూ… సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమకైన JAC కు సిపీఎస్ ఉద్యోగులు ఎల్లవేళలా సంసిద్ధులై ఉంటారన్నారు. ప్రభుత్వం మా సిపిఎస్ విధానం పట్ల తక్షణమే చర్యలు చేపట్టాలని ఇది కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో ఒక విధానం అమలు చేస్తూ దక్షిణ భారత దేశంలో ఉన్న మరో రెండు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణకు మరొక విధంగా అమలు చేస్తూ వివక్షను చూపుతోందని అనిపిస్తుంది ఇక మా న్యాయమైన పాత పెన్షన్ సాధించేదాకా విశ్రమించేది లేదన్నారు.  సిపీఎస్ రద్దు కోసం ఓపిఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యమం చేస్తుంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి యుపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది ఎన్పీఎస్ లో నుండి యుపిఎస్ విధానానికి రాడానికి ఆప్షన్ను ఇవ్వడం జరిగింది. ఈ స్కీం గురించి తెలిసి దేశవ్యాప్తంగా పోటీమందు ఉద్యోగ ఉపాధ్యాయులు ఉంటే కనీసం వందల్లో కూడా ఈ యుపిఎస్ విధానాన్ని ఎంచుకోకపోవడానికి ఇష్టపడడం లేదు .

యూ.పి.యస్ లో ఉద్యోగి ఉపాధ్యాయుని యొక్క ప్రాన్ అకౌంటు సొమ్ము మొత్తం ఎన్పీఎస్ ట్రస్ట్ కు తరలించిన తర్వాతే ఉద్యోగి యొక్క సర్వీస్ పెన్షన్ పై నిర్ణయం జరుగుతుంది. ఇది ఒక యూజ్లెస్ పెన్షన్ స్కీం. జె.ఏ. సి సిపీఎస్ రద్దు కు 206 సంఘాలు ఏకమై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరం లోపు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని ఏకవాక్య  తీర్మానించడం పట్ల సిపీఎస్ యూనియన్ అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ,ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,నరేష్ గౌడ్ లు హర్షం వ్యక్తం చేశారు.

యుటిఎఫ్ అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ సమస్యకైనా ఐక్య పోరాటమే ముఖ్యమని పిలుపునిచ్చారు

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కాకముందు జేఏసీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ సమావేశానికి హాజరయ్యానని జేఏసీ తీసుకుని నిర్ణయాలకు నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు

ఎస్టీయూ అధ్యక్షులు సదానంద గౌడ్ మాట్లాడుతూ సిపిఎస్ అంతం జేఏసీ  పంతంగా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు  పోరాడుదాం అని తెలిపారు