BIKKI NEWS (FEB. 23) : Telangana employees Pending bills in Telangana 2026 – 27. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే దాదాపు 8 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు సమాచారం. (EMPLOYEES NEWS)
Telangana employees Pending bills in Telangana 2026 – 27
ఈ ఆర్థిక సంవత్సరంలో 9,500 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నారు. దీంతో పెండింగ్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా 700 కోట్ల రూపాయలను గత ఆరు నెలలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే అయినప్పటికీ పెండింగ్ బిల్లులు ఇంకా భారీగానే ఉన్నాయి.
నెలకు 1500 కోట్లు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నేతలు చూస్తున్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పెళ్లిళ్లు, గృహ నిర్మాణం, వైద్య ఖర్చులు వంటివి తలనొప్పిగా మారినట్లు రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

