BIKKI NEWS (NOV. 18) : Telangana cabinet decisions on 18th November 2025. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana cabinet decisions on 18th November 2025.
తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందించిన ప్రజా కవి అందెశ్రీ గారు మరణించడం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు.. వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కేబినెట్ నివాళులు అర్పించింది. వారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, అందెశ్రీ గారి స్మృతి వనం ఏర్పాటు, పాఠ్యపుస్తకాలలో మొదటి పేజీలో అందెశ్రీ గారు రచించిన ‘జయజయహే’ రాష్ట్ర గీతాన్ని ముద్రించాలని కేబినెట్ తీర్మానించింది.
ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసిలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా తీసుకున్న నిర్ణయానికి కేంద్రం సహాకారం లేనందున, గౌరవ హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ 50% రిజర్వేషన్లకు లోబడి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
15వ ఫైనాన్స్ కమీషన్ నిధుల విడుదల దృష్ట్యా ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం.
తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్ కి రక్షణ, భరోసా కల్పించేలా రూపొందించిన చట్టాన్ని కేబినెట్ ఆమోదించింది.
SRSP ఫేజ్ 2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది
ప్రభుత్వం ఏర్పడి 2 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సగర్వంగా వారోత్సవాలను నిర్వహించాలని గత మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో ఫోర్త్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, 9వ తేదీన తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ని విడుదల చేయాలని కెబీనెట్ నిర్ణయించింది.
సౌదీలో జరిగిన ఘోర ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల మంత్రి వర్గం సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించింది. సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ ప్రతినిధి బృందాన్నిపంపించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. బాధిత కుటుంబాల కోరిక మేరకు అంత్యక్రియలు కూడా వారి ఆచారం ప్రకారం అక్కడే నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
