వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు ఇవ్వకుంటే చర్యలు - bikki news

వేతనంతో కూడిన ప్రత్యేక సెలవు ఇవ్వకుంటే చర్యలు

BIKKI NEWS (OCT. 19) : Special casual leave must sanction to employees on polling day. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే సంబంధించిన యాజమాన్యాలకు జరిమానా విధిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Special casual leave must sanction to employees on polling day

సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

.
వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సినరోజు ఎవరి వేతనాల్లో కోత విధించరాదని స్పష్టం చేసింది. డైలీ వేజేస్ పద్దతిలో పనిచేసే వారికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.

ఎన్ని కలు జరిగే నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉంటూ వేరే చోట ఉద్యోగాలు, పనులు చేస్తున్నవారు కూడా పోలింగ్ తేదీ నాడు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని స్పష్టంచేసింది. దీనిపై రాష్ట్రాలు విడిగా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →