BIKKI NEWS (DEC. 28) : Show Cause notices for absentee teachers తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలామంది అనధికార గైర్హాజరు అవడంతో వారికి జిల్లా విద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
Show Cause notices for absentee teachers
FRS అటెండెన్స్ ఉన్నప్పటికీ రోజుకి 5 నుండి 6 వేల మంది టీచర్లు ఎలాంటి అనుమతి లేకుండానే పాఠశాలలకు డుమ్మా కొడుతున్నట్లు విద్యా శాఖ లెక్క తేల్చింది.
డిసెంబర్ 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 9,031 మంది టీచర్లు అనధికారికంగా గైర్హాజరైనట్లు తేలింది. మీరెవరు ఎఫ్ ఆర్ ఎస్ లో హాజరు కాకపోవడానికి కారణాలు నమోదు చేయలేదు.
కామారెడ్డి జిల్లా విద్యాధికారి 1,250 మంది టీచర్లకు ఈ అంశంపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 29 నుండి గైర్హాజరైన టీచర్లకు జిల్లా విద్యాధికారులు షోకాజ్ నోటీసులు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

