BIKKI NEWS (JAN. 03): SAVITHRI BAI PHULE JAYANTI CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
SAVITHRI BAI PHULE JAYANTI CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD.
ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వీ లలిత శ్రీమతి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నమస్సుమాంజలులు తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షత వహించడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని తెలుపుతూ దేశంలో ఎన్నో పాఠశాలలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించడం జరిగిందని పేర్కొన్నారు. సాంఘిక దురాచారాలు, బాల్య వివాహాలను రూపుమాపడంలో కీలక పాత్ర వహించారని పేర్కొంటూ సామాజిక కార్యకలాపాలలో విశేషమైన సేవలు అందించారన్నారు. విద్యార్థినిలు శ్రీమతి సావిత్రిబాయి పూలే.జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో ముందుకెళ్లి లక్ష్యాన్ని సాధించాలన్నారు.
అనంతరము కళాశాల ప్రిన్సిపాల్ మరియు మహిళా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ మమ యొక్క పర్యవేక్షణలో జరిగినది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం శ్రీ డి రవీందర్, శ్రీ ఎస్ సదానందం, శ్రీమతి టి నిర్మలాదేవి, శ్రీ బి లక్ష్మయ్య, శ్రీ ఏ సంపత్, శ్రీమతి ఎస్ కవిత, శ్రీమతి జి కవిత, శ్రీమతి ఆస్మాపిర్దోస్, కుమారి ఓ రాణి,.లైబ్రేరియన్ శ్రీమతి బి హిమ బిందు, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి.కే గీతాంజలి, జూనియర్ అసిస్టెంట్ ఎస్ రాములు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు.విద్యార్థినిలు మొదలవారు పాల్గొన్నారు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
